కేంద్రమంత్రిగా చిరంజీవి ప్రమాణం: హాజరైన కుటుంబం

Chiranjeevi
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రాష్ట్రపతి భవనంలో ఆదివారం ప్రారంభమైంది. మన రాష్ట్రానికి చెందిన చిరంజీవి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, కిల్లి కృపారాణీ, పల్లం రాజులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో చిరు, కిల్లి, బలరాంలు తొలిసారి ఎంపీలు అయ్యారు. వారికి మొదటిసారే కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కింది.

ప్రమాణ స్వీకారం సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులు, కాంగ్రెసులోని చిరంజీవి వర్గం నేతలు పలువురు హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శనివారమే తన సోదరుడికి శుభాకాంక్షలు తెలిపారు. చిరు, ఆయన కుటుంబ సభ్యులు, నేతలు నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. మొత్తంగా ఈ రోజు 22 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ఏడుగురు ప్రమాణం చేశారు. 13 మంది సహాయ మంత్రులుగా, ఇద్దరు స్వతంత్ర హోదాలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ ప్రమాణ స్వీకారానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం 11.30 గంటలకు ప్రారంభమైంది. కొత్తగా ఐదుగురు మంత్రులు ప్రమాణం చేశారు.

సహాయ మంత్రిగా ఉన్న పల్లం రాజు కేంద్రమంత్రిగా పదోన్నతి లభించింది. చిరంజీవి, కిల్లి, సర్వే, బలరాం, కోట్లతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+