సిఎం కావాలంటే..: చిరంజీవికి జగన్ పార్టీ నేత సలహా

Chiranjeevi - Harirama Jogaiah
హైదరాబాద్: కేంద్రమంత్రి చిరంజీవికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంటే ఆయన పాదయాత్ర చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చేగొండి హరిరామ జోగయ్య సోమవారం సూచించారు. ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాదయాత్రల సీజన్ నడుస్తోందని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నుండి 2014లో ముఖ్యమంత్రిగా కావాలని కనీసం నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని చిరంజీవికి సలహా ఇచ్చారు.

కాంగ్రెసు పార్టీలో కూడా ఎవరో ఒకరు పాదయాత్ర తలపెట్టి పార్టీని బతికించే ప్రయత్నం చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారని అన్నారు. వారి ఆకాంక్షను చిరంజీవి తన నెత్తిన వేసుకొని పాదయాత్రకు సంకల్పిస్తే వారి కోరిక నెరవేరుతుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి కావాలనే చిరంజీవి దీర్ఘకాలిక కోరిక కూడా నెరవేరుతుందని ఆయన చెప్పారు.

కాగా రెండు రోజుల క్రితం చిరంజీవిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసమే కాంగ్రెసు పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారనే వాదనలు ఉన్నాయి. అవకాశం వస్తే చిరంజీవి పార్టీకి నాయకత్వం వహిస్తారని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సోమవారం చెప్పారు.

పలువురు సొంత పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతు క్రమంగా చిరంజీవికి ఇటీవల పెరుగుతోంది. దీంతో ఆయనే 2014 ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని చాలామంది భావిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కూడా చిరంజీవినే యోగ్యుడిగా గుర్తిస్తుండవచ్చునని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+