ఎక్కడ్నించి తెస్తావ్-అవసరం లేదు: కిరణ్ వర్సెస్ బాబు

రుణమాఫీకి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుండి తెస్తావని కిరణ్ ప్రశ్నించారు. ఏ పథకాన్ని రద్దు చేసి రుణమాఫీకి బదలీ చేస్తావని అడిగారు. ఆరోగ్యశ్రీ, రూపాయికి కిలో బియ్యం తదితర వాటిల్లో వేటిని రద్దు చేస్తావని అడిగారు. సంక్షేమ పథకాలు రద్దు చేస్తే రూ.70వేల కోట్లు తీసుకు వస్తావా అన్నారు. రైతులు బాగుపడటం ఇష్టం లేని చంద్రబాబు అమలు చేయలేని హామీలు ఇస్తున్నారని విమర్శించారు.
అసత్యాలతో చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయకుండా మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారం కోసం మళ్లీ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు ప్రకటనలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తెలుగుదేశం పార్టీ బిసిల కోసం రూ.150 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం రూ.3వేలు ఖర్చు చేసిందన్నారు.
బిసిల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలే తేలుస్తారన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలు సరికాదన్నారు. చంద్రబాబు తన వైఖరిని మార్చుకుంటే బాగుంటుందన్నారు. కాంగ్రెసు పార్టీకి అధికారం ముఖ్యం కాదని ప్రజా సంక్షేమం ముఖ్యమన్నారు. ఈ ప్రభుత్వం 2014 వరకు కొనసాగుతుందన్నారు.
కిరణ్‌కు బాబు కౌంటర్
రుణమాఫీకి డబ్బులు ఎక్కడి నుండి తీసుకు వస్తావన్న కిరణ్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన మహబూబ్ నగర్‌లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రుణ మాఫీ పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదన్నారు. కాంగ్రెసు పాలన నుంచి నేర్చుకోవాల్సన అవసరం తమకు ఏమాత్రం లేదన్నారు. గతంలో తమ పోరాటం కారణంగా రుణమాఫీ చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications