సీమాంధ్ర పర్యటన: డైలమాలో కెసిఆర్, ఆ భయమేనా

అయితే బొత్స కూతురు వివాహానికి కెసిఆర్ సీమాంధ్రకు పర్యటిస్తే అది వ్యక్తిగత పర్యటన అవుతుందే కానీ అధికారిక పర్యటనో రాజకీయ పర్యటనో కాదు. అలాంటప్పుడు ఇంకా చర్చించాల్సిన అవసరం ఏముందనేది పలువురి ప్రశ్న. విజయనగరం వెళ్లేందుకు అంతగా ఆలోచించాల్సిన అవసరముందా అంటున్నారు. అయితే కెసిఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు.
కెసిఆర్ గతంలో సీమాంధ్ర నేతలనే కాకుండా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి నుండి లేదా సీమాంధ్ర ప్రజల నుండి తనకు తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతాయనే ఆందోళనతోనే ఆయన విజయనగరం వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా వారు అతనిని నిలదీసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ఆ భయంతోనే కెసిఆర్ విజయనగరం వెళ్లే విషయమై నిర్ణయం తీసుకోలేదంటున్నారు. నిర్ణయం తీసుకోలేదని చెప్పినప్పటికీ ఆయన వెళ్లేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. పార్టీ నాయకులు కెసిఆర్ వెళ్లొద్దనే కోరుకుంటున్నారట. గతంలో తెలుగుదేశం పార్టీ కెసిఆర్‌ను విజయనగరం జిల్లాకు చెందిన వాడిగా చెప్పింది. ఇప్పుడు వెళ్తే ఆ విషయం మరోసారి గుర్తుకు చేసినట్లుగా అవుతుందనే భావన పార్టీ వర్గాల్లో ఉందట.












Click it and Unblock the Notifications