కోదండరామ్ హౌస్ అరెస్ట్: తెలంగాణలో నిరసనలు

ప్రజల ఆకాంక్షను తెలియజేసేందుకే తాను నిరసన చేస్తున్నామని కోదండరామ్ ఈ సందర్భంగా అన్నారు. తమను హౌస్ అరెస్టు చేయడం బాధాకరమన్నారు. తమకు నిరసన తెలియజేసేందుకు కూడా హక్కు లేదా అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రభుత్వంలో తెలంగాణవాదులను అణగదొక్కుతున్నారని నిప్పులు చెరిగారు. తమ హౌస్ అరెస్టులను నిరసిస్తూ తాము గన్ పార్కు వద్ద నిరసన తెలియజేస్తామని టిజెఏసి తెలిపింది. కోదండరామ్ ఇంటి వద్ద భారీ బందోబస్త ఏర్పాటు చేశారు.
కాగా జెఏసి పిలుపు మేరకు తెలంగాణలోని పది జిల్లాల్లో తెలంగాణవాదులు నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పైన నల్ల జెండాలు ఎగురవేశారు. మంత్రులు తాము అవతరణ వేడుకల్లో పాల్గొనబోమని చెప్పడంతో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు జెండాను ఎగురవేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ కర్ఫ్యూ వాతారవణం కనిపించింది. స్టేడియం చుట్టు ఉన్న ఇళ్లు, అపార్టుమెంట్లకు పోలీసులు పరదాలు కట్టారు. తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పలు గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. దాదాపు ఐదువ వేల మంది పోలీసులతో పలు చోట్ల బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications