వాల్‌మార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాహుల్: రేవంత్ రెడ్డి

సోనియా, రాహుల్‌లు తమ పేర్ల చివర్ల ఉన్న గాంధీని తొలగించుకోవాలని డిమాండ్ చేశారు. నాడు జాతిపిత మహాత్మా గాంధీ విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. నేడు రాహుల్ గాంధీ వాల్ మార్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రసంగిస్తున్నారన్నారు. వాల్ మార్ట్ ప్రచారకార్యదర్శిగా వ్యవహరించారన్నారు. దేశాన్ని నిర్దేశించ వ్యక్తిగా ఆయన తీరు లేదన్నారు. అవినీతి క్యాన్సర్ వంటిదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
అవినీతిపై సోనియా 16 నిమిషాలు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 20 నిమిషాలు, రాహుల్ గాంధీ 18 నిమిషాలు మాట్లాడారని, క్యాన్సర్ వంటిది అని చెప్పడం మినహా.. అవినీతిపరులపై ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెప్పలేదన్నారు. ఒక్క నిమిషం కూడా అవినీతిపరులపై తీసుకునే చర్యల గురించి మాట్లాడలేదన్నారు. సోనియా గాంధీ కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గాంధీ పేరును వారు తొలగించుకోవాలన్నారు.
ఎఫ్‌డిఐలను ఆహ్వానించడం దారుణమన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు కాంగ్రెసు పార్టీ అవినీతి అడ్డాగా మారాయన్నారు. అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రంలో, దేశంలో తీసుకోనున్న చర్యల గురించి కాంగ్రెసు పార్టీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీని ప్రజలు బహిష్కరించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications