'సిఎంగారు! మీ పదవి కాదు మా ఉద్యోగమూ చూడండి'
ప్రభుత్వం తమను ఉద్యోగాల నుండి తొలగించిందని, వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవనం కింద ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేస్తే తాము భవనం పైనుండి కిందకు పైనున్న వారు హెచ్చరించారు. తాము పదహారు వందల మందిమి ఉన్నామని, తమకు ఎలాంటి నోటీసులు, హామీలు ఇవ్వకుండానే తమను ఉద్యోగాల నుండి తొలగించారని వారు ఆరోపించారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగం నుండి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటేనే తాము తమ ఆందోళన విరమిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నాలు చేయకుండా తమ ఉద్యోగాలపై దృష్టి సారించాలన్నారు. రాజీవ్ యువకిరణాలు పేరుతో లక్షల ఉద్యోగాలు అంటున్న ప్రభుత్వం తమను ఉద్యోగాల నుండి ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు.
ఆందోళన చేస్తున్న వారిలో ఓ యువతి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తే ఆమె వద్దన్నారు. తమను ప్రభుత్వం అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించిందని, తన ఒక్కదాని ప్రాణం పోయినా ఫరవాలేదు. కానీ ఉద్యోగాలు వస్తే అంతే చాలన్నారు.