ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న గోపాల్‌ను హతమార్చేందుకు చిలుకమ్మ, గంగాధర్‌లు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో గోపాల్ బలహీనంగా ఉన్నాడంటూ భర్తకు గ్లూకోజ్ బాటిల్ ఎక్కించాలని పిఎంపి వైద్యుడైన గంగాధర్‌ను చిలుకమ్మ పిలిపించింది. గోపాల్‌ను ఒప్పించి మత్తు మందు కలిపిన గ్లూకోజ్ బాటిల్ ఎక్కించారు. దీంతో స్పృహ కోల్పోయిన గోపాల్‌ను చిలుకమ్మ, గంగాధర్‌లు మెడకు ఉరి బిగించి హత్య చేశారు.
మొదట ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకుని ప్రయత్నించినప్పటికీ, పోలీసులకు దొరికిపోతామని భయపడి ఇద్దరూ పోలీసులకు లొంగిపోయారు. పట్టణ సిఐ సంఘటనా స్థలానికి వచ్చి, మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. గోపాల్‌కు పెళ్లి అయిన కూతురితో పాటు పదేళ్ల కొడుకు ఉన్నాడు.












Click it and Unblock the Notifications