ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన జగన్ పార్టీ నేత

రాజేష్ పది రోజుల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిసిన విషయం తెలిసిందే. త్వరలో తన శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను కార్యకర్తగా పని చేస్తానని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తాను శాసనసభ్యుడిగా విజయం సాధించానని ఆయన విజయమ్మతో భేటీ తర్వాత మీడియాతో చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకున్నారు. కాగా గత ఎన్నికల్లో రాజేష్‌పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కర్రా రాజారావు కూడా త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని సమాచారం. కొవ్వూరులో జరిగే బహిరంగ సభలో వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications