చెక్కుచెదరని రూపాయి.. ఆర్బీఐ వ్యూహంతో భారత్‌కు ఊరట!

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో నింగినంటిన ముడిచమురు ధరలు.. ఏ రకంగా చూసినా భారత రూపాయికి కోలుకోలేని దెబ్బ తగలాల్సిన సమయమిది. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే క్రూడ్ ఆయిల్ రేట్లు ఏకంగా 20 శాతానికి పైగా భగ్గుమన్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ కరెన్సీ విపరీతంగా క్షీణించి, దిగుమతుల భారం భారత్‌పై దారుణంగా పడేది. కానీ, మన దేశంలోకి పోటెత్తిన విదేశీ పెట్టుబడులు, భారత రిజర్వ్ బ్యాంక్ సమయానుకూల వ్యూహాలు రూపాయిని పతన అంచుల్లో నుంచి రక్షించాయి. ఈ ఆసక్తికర వివరాలను ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం 'బ్యాంక్ ఆఫ్ బరోడా' తన పరిశోధనా నివేదికలో వెల్లడించింది.

గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు సెగలు పడుతున్నప్పటికీ, గత జూలై నెలలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో నమోదైన క్షీణత కేవలం 0.8 శాతం మాత్రమే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా డాలర్ సూచీ 1.3 శాతం పడిపోవడం రూపాయికి మొదటి ఊరటనివ్వగా.. ఆర్బీఐ అనుసరించిన తెలివైన విధానాలు నాణేనికి మరోవైపు కొండంత అండగా నిలిచాయి. ముడిచమురు ధరల ధాటికి రూపాయి ఊబిలో కూరుకుపోకుండా విదేశీ మూలధనం పక్కాగా కాపాడింది.

Indian Rupee Holds Firm Despite 20 Percent Crude Surge as FPI Inflows Hit 22 Month High Report

క్యూ కట్టిన విదేశీ ఇన్వెస్టర్లు..

భారత ఆర్థిక వ్యవస్థపై ఉన్న బలమైన నమ్మకంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, మన షేర్ మార్కెట్లోకి నిధులను భారీగా పంపింగ్ చేశారు. గత నెలలోనే ఏకంగా 4.2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు భారత ఈక్విటీ, డెబ్ట్ మార్కెట్లలోకి ప్రవహించాయి. ఇది గత 22 నెలల్లోనే అత్యధిక కావడం గమనార్హం. అంతేకాకుండా, ఆర్బీఐ చేపట్టిన ప్రత్యేక ఉపశమన చర్యల కారణంగా దాదాపు 40.8 బిలియన్ డాలర్ల అదనపు నిధులు దేశంలోకి వచ్చి చేరాయి. ఫారెక్స్ మార్కెట్‌లో ఆర్బీఐ సకాలంలో జోక్యం చేసుకుని డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయి పతనాన్ని సమర్థవంతంగా అడ్డుకుంది.

మన రూపాయి బ్రహ్మాండం.. యుద్ధం జరుగుతున్నా నిలబడింది
మన రూపాయి బ్రహ్మాండం.. యుద్ధం జరుగుతున్నా నిలబడింది

రూ.57 లక్షల కోట్లకు పైగా ఫారెక్స్ నిల్వలు..

దేశంలో వర్తక లోటు కాస్త పెరిగినప్పటికీ, భారత విదేశీ మారక నిల్వలు అత్యంత సురక్షితమైన స్థాయిలో ఉన్నాయి. జూలై చివరి నాటికి మన దేశంలో 682.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.57 లక్షల కోట్లకు పైగా) భారీ ఫారెక్స్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి దాదాపు 10 నెలల పాటు దేశానికి కావలసిన దిగుమతులకు సరిపోతాయి. వీటితో పాటు విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సులు, సర్వీసెస్ రంగం అందించిన ఆదరణ భారత్‌ను బలమైన స్థితిలో నిలబెట్టాయి.

రారాజులా రూపాయి.. నేడే ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన!
రారాజులా రూపాయి.. నేడే ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన!

ముంగిట్లో సవాళ్లు.. రూపాయి భవిష్యత్తు రేంజ్ ఎంతంటే?

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లోనూ క్రూడ్ ఆయిల్ ధరలు మండిపోయే అవకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కరెన్సీ మార్కెట్‌లో కొంత ఊగిసలాట తప్పకపోవచ్చు. అయినప్పటికీ, భారత్‌లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు ఇలాగే కొనసాగితే పెద్దగా భయపడాల్సిన పనిలేదని తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.25 నుంచి 95.75 శ్రేణి మధ్య ట్రేడ్ అయ్యే అవకాశముందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+