బరాక్ ఒబామా గెలుపు: 'అమెరికా' పదనిసలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామా రెండోసారి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి మిట్ రోమ్నీ మొదట మంచి పోటీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బాగా వెనుకబడ్డారు. ఒబామా 303, రోమ్నీ 206 స్థానాల్లో గెలుపొందారు. ఒబామా గెలుపొందటంతో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గెలిచిన అనంతరం ఒబామా ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అమెరికా ప్రజలకు భవిష్యత్తుపై హామీ ఇచ్చారు.

గెలుపొందిన తర్వాత ఒబామా తన విజయానందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. 'మరో నాలుగేళ్లు' అంటూ ఒబామా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అందులో తన భార్యను హత్తుకున్న ఫోటోను ఉంచారు. ఇదే ఫోటోను ఫేస్‌బుక్‌లోనూ పెట్టారు. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిందిగా పేరుపొందింది. మేం మీకు ఓటు వేశం, విద్య, వైద్యం, గ్రీన్ ఎనర్జీ విషయంలో మీరు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చుకుని మేం గర్వపడేలా చేయండని అభిమానులు షేర్ చేశారు.

గెలుపొందిన తర్వాత ఒబామా తన కూతుళ్లు సారా, మలియాతో ఒక కుక్క చాలు అంటూ జోక్ చేశారు. ఒబామా 2008లో తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందినప్పుడు కూతుళ్లు ఓ కుక్కను అడిగారు. ఇప్పుడు రెండోసారి మళ్లీ కుక్కను అడుగుతారేమోననే ఉద్దేశ్యంతో అతను ఒక కుక్క చాలు అని చమత్కరించారు.

బరాక్ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవడంతో డెమోక్రటిక్ పార్టీ భవనం నీలి కాంతులతో విరజిల్లింది. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఒబామా గెలుపుకు సూచకంగా నీలం రంగు కాంతులతో తణుకులీనింది. ఇది ఆ పార్టీ గుర్తు. అంతకుముందు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఓ వైపు నీలం రంగు, మరో వైపు రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎరుపు రంగు గుర్తులు పెరుగుతూ.. తగ్గుతూ(పార్టీలు గెలిచిన గెలిచిన ఓట్లను అనుసరించి) వచ్చాయి. ఒబామా గెలిచిన విషయం తెలియగానే 102 అంతస్తుల భవనం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది.

బిల్ క్లింటన్(జనవరి 20, 1993 - జనవరి 20, 2001), జార్జి బుష్(జనవరి 20, 2001 - జనవరి 20, 2009)ల తర్వాత ఒబామా రెండుసార్లు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. వరుసగా రెండోసారి గెలిచిన వారు 14 మంది ఉన్నారు. అయితే వరుసగా రెండుసార్లు గెలిచిన ముగ్గురు వ్యక్తుల్లో క్లింటన్, బుష్, ఒబామా ఉన్నారు.

ఒబామా ఎన్నికల కోసం విరాళాల సేకరణ సమయంలో ప్రసంగించినప్పుడు పలుమార్లు మన జాతిపిత మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలాల పేర్లను పలుమార్లు ప్రస్తావించారు. రెండోసారి తనకు అవకాశమివ్వాలని కోరుతూ... ఆ మహాత్ములు సాధించినట్లే.. నిజమైన మార్పును సాధఇంచడానికి సాయం చేయాలని కోరారు.

అమెరికాలో ఒబామా గెలిస్తే కెన్యా దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఒబామా తండ్రి గ్రామమైన కెన్యాలోని కొగెలోలో ఫలితాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా తెర కూడా ఏర్పాటు చేశారు. రాత్రంతా ఆ గ్రామ ప్రజలు ఫలితాల కోసం ఎదురు చూశారు. గెలుపు విషయం తెలియగానే గ్రామ ప్రజలకు పాటలు పాడుతూ చిందేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నీకి తన సొంత రాష్ట్రాల్లోనూ ఎదురు దెబ్బ తగిలింది. రోమ్నీ తన పుట్టిన స్థలం మిచిగాన్‌తో పాటు గవర్నర్‌గా పని చేసిన మసాచూసెట్స్‌లో కూడా ఓటమి చెందారు. మసాచూసెట్స్‌లోనే ఆయన ఉంటున్నారు. ఈ రెండు రాష్ట్రాలు ఒబామా ఖాతాలోనే పడటం గమనార్హం.

అమెరికా ఎన్నికల్లో తులసీ గబార్డ్ అనే 31 ఏళ్ల హిందూ అమెరికన్ యువతి గెలుపొందారు. అమెరికన్ కాంగ్రెసులో అడుగుపెట్టే తొలి హిందువుగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి తులసీ గబార్డ్ చరిత్ర సృష్టించారు. భారత సంతతికి చెందిన డాక్టర్ అమీ బెరా కూడా గెలుపొందారు.
తన విజయం ప్రజల విజయమని చెప్పి, ప్రత్యర్థి రోమ్నీని పొగడ్తలలో ముంచెత్తారు. రోమ్నీ తనకు గట్టి పోటీ ఇచ్చారని, ఆయన మంచి దేశభక్తుడని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పారు. ఒబామా అమెరికా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో ఆయన సతీమణి మిచెల్లీ ఒబామా, కూతుర్లు కూడా వచ్చారు. ఒబామా గెలుపుతో డెమోక్రాట్లు ఆనందంలో మునిగిపోయారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications