టివి రియాల్టీషోలో పాల్గొని పార్టీ నుండి సస్పెండైన ఎంపి

రియాల్టీ షోలో పాల్గొన్నందుకు ఒక ప్రజా ప్రతినిధిని పార్టీ నుండి బహిష్కరించడం గమనార్హం. నదినే డోరిస్ ఆస్ట్రేలియాకు చెందిన 'ఐ యామ్ ఏ సెలబ్రిటీ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' అనే రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ షో షూటింగ్ అడవిలో జరుగుతుంది. ఇందులో పాల్గొనే వారు రక రకాల పనులు చేయాల్సి ఉంటుంది.
బ్రిటన్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి నదినే డోరిస్ చర్యలు అసలే మాత్రం నచ్చలేదట. ఆమె క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చి పార్టీ అధినేత విప్ జార్జ్‌ను కలిసే వరకూ ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications