యుఎస్ ఎన్నికల్లో తొలి హిందూ అమెరికన్ గెలుపు

వాషింగ్టన్: అమెరికన్ కాంగ్రెసులో అడుగుపెట్టే తొలి హిందువుగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి తులసీ గబార్డ్ చరిత్ర సృష్టించారు. హవాయి నుండి ఆమె బరిలోకి దిగి తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కే క్రోలేపై ఘన విజయం సాధించారు. ఆమెరికన్ నమోవాలో కేథలిక్ తండ్రికి, హిందూ తల్లికి జన్మించిన తులసి గబార్డ్ తల్లికి చెందిన హిందుత్వాన్నే స్వీకరించారు. ఆమె 2002లోనే 21 ఏళ్ల చిన్న వయస్సులో హవాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రికార్డ్ సృష్టించారు.

Tulsi Gabbard

తులసీ గబార్డ్ వయస్సు ఇప్పుడు 31. ఈమె తన ప్రత్యర్థి కే క్రోలేపై మంచి ఆధిక్యంతో గెలిచారు. తులసీ గబార్డ్ విజయాన్ని అమెరికాలో ఉన్న హిందువులంతా తమ విజయంగా భావిస్తున్నారు. అందిన సమాచారం మేరకు.. కేవలం యాభై శాతం ఓట్లు లెక్కింపు పూర్తయ్యే వరకే ఆమె తన ప్రత్యర్థి కంటే 1,20,000 ఓట్ల లీడ్‌తో ఉన్నారు. ఈమె హవాయిలోని సెకండ్ కాంగ్రెషనల్ నుండి బరిలోకి దిగారు.

తాను పోటీ చేసిన హవాయిలో ఎక్కువ మంది హిందువులు లేరని, కానీ తాను ఎప్పుడూ వివక్షకు గురి కాలేదని తులసి ఓటింగ్‌లో లీడ్‌లో ఉన్న విషయం తెలిసి అన్నారు. కాగా అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డాక్టర్ అమీ బెరా కూడా గెలుపొందిన విషయం తెలిసిందే.

కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ జిల్లా నుండి అమీ బెరా విజయం సాధించారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన భారత సంతతికి చెందిన మూడో వ్యక్తిగా అమీ బెరా రికార్డ్ సృష్టించారు. న్యూజెర్సీ అసెంబ్లీ ఉప సభాపతి చివుకుల ఉపేంద్ర ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు.

45 ఏళ్ల అమీ బెరా డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇతను రిపబ్లికన్ అభ్యర్థిపై 184 ఓట్లతో విజయం సాధించారు. బెరా 50.1 శాతం ఓట్లు దక్కించుకోగా, ఆయన ప్రత్యర్థి డాన్ లుంగ్రేన్ 49.9 శాతం ఓట్లను దక్కించుకున్నారు. బెరా 88,406 ఓట్లు దక్కించుకున్నారు. లుంగ్రేన్ 88,222 ఓట్లు పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+