గర్ల్ ఫ్రెండ్ పక్కనుంటే ప్రమాదాలు: ముఖ్యమంత్రి వ్యాఖ్య

ఒక మంచి మోటార్ సైకిల్, కొత్త మొబైల్, ఒక స్నేహితురాలు ఉంటే చాలు... ప్రమాదాలు వాటంతట అవే జరుగుతున్నాయన్నారు. వేలాది రూపాయలు పెట్టి బైక్‌లు కొనేవారు ప్రాణాన్ని రక్షించేందుకు అవసరమైన హెల్మెట్‌లను మాత్రం వందల రూపాయలు పెట్టి కొనడానికి కూడా వెనుకాడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రమణ్ సింగ్ వ్యాఖ్యలను కాంగ్రెసు పార్టీ తీవ్రస్థాయిలో ఖండించింది.
కాగా ఇటీవల పలువురు రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్యను రూ.50 కోట్ల విలువైన గర్ల్ ఫ్రెండ్‌గా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ ఎంపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications