వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపద్బాంధవుడున్నాడు: చిరంజీవి, ఢోకా లేదన్న జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - JC Diwakar Reddy
హైదరాబాద్/ఏలూరు: మజ్లిస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని కేంద్రమంత్రి చిరంజీవి సోమవారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో నీలం తుఫాను బాధితులను పరామర్శిస్తున్నారు. మజ్లిస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ప్రకటన తెలియగానే ఆయన స్పందించారు. ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు.

ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఆపద్భాంధవుడు ఉన్నాడన్నారు. ప్రభుత్వం కూలిపోయే సమస్యే లేదని, 2014 వరకు కొనసాగుతుందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల వరకు ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. మజ్లిస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన ముస్లింలు తమకు దూరం కారని చెప్పారు.

స్థానిక అంశానికి సంబంధం లేదన్నారు. 2014 ఎన్నికల వరకు ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. మజ్లిస్‌కు తమకు మధ్య చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ వచ్చిందని, అవే కుదురుకుంటాయని చెప్పారు. అపార్థంతో మజ్లిస్ తమ మద్దతు ఉపసంహరించుకుందని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.

సంగారెడ్డిలో జరిగిన అల్లర్లలో తన ప్రమేయం లేదని స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గా రెడ్డి) అన్నారు. మజ్లిస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం సరికాదన్నారు. అలా చేస్తే ముస్లింలే మజ్లిస్‌ను వ్యతిరేకిస్తారన్నారు. కిరణ్ ప్రభుత్వంపై ముస్లిం వ్యతిరేక ముద్ర వేయడం దారుణమన్నారు. కిరణ్ అన్ని వర్గాల వారిని కలుపుకొనిపోతున్నారని చెప్పారు.

మజ్లిస్ పార్టీ వైఖరితో తమ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని మంత్రి శైలజానాథ్ అన్నారు. కిరణ్ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారన్నారు. మజ్లిస్ నిర్ణయం సరైనది కాదని తన అభిప్రాయమన్నారు. మైనార్టీల పట్ల కాంగ్రెసుకు ఎప్పుడూ బాధ్యత ఉందన్నారు. కాంగ్రెసు హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. కోర్టు తీర్పును మాత్రమే ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

English summary
Central Minister Chiranjeevi said that Apadbandhavudu is there to protect Kiran Kumar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X