మజ్లీస్ నిర్ణయాన్ని తేలిగ్గా కొట్టిపారేసిన బొత్స

తమ స్థానంలో మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నా తమలాగే వ్యవహరించి ఉండేవారని బొత్స సత్యనారాయణ అన్నారు. పాతబస్తీ సంఘటన విషయంలో తమ మద్దతు ఎవరకీ లేదని ఆయన అన్నారు. శాంతిభద్రతల విషయంలో అన్ని ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తాయో తమ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించిందని ఆయన అన్నారు.
మజ్లీస్‌తో సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు. పరిస్థితిని మజ్లీస్ నేతలు అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మజ్లీస్ మద్దతు ఉపసంహరణ చాలా చిన్న విషయమని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో శాంతిభద్రతల పరిరక్షణ చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఎవరూ ఆవేశకావేశాలకు లోను కావద్దని ఆయన సూచించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి మజ్లీస్ మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరమని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని ఆయన అన్నారు. కాగా, ప్రభుత్వానికి మజ్లీస్ మద్దతు ఉపసంహరించుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. ప్రభుత్వాన్నికి మజ్లీస్ మద్దతు ఉపసంహరించుకోవడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణ నాయుడు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications