తెలంగాణపై ఇదే లాస్ట్ ఛాన్స్: కెకె, కెసిఆర్‌కు కితాబు

తెలంగాణకోసం ఉద్యమించిన అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకోసం అన్నీ వదులుకున్నామని, అధిష్ఠానాన్ని కూడా సవాలు చేశామని, ఇప్పుడు మరోసారి సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రెండు, మూడు రోజుల్లో ఓ లేఖ రాస్తారని ప్రకటించారు. తెలంగాణపై డిసెంబర్ 9 లోగా నిర్ణయం చెప్పాలని ఆ లేఖలో కోరతామని, తమ యాక్షన్ ప్లాన్‌ను కూడా అందులో వివరిస్తామని చెప్పారు.
ఇదే తమ చివరి ప్రయత్నమన్నారు. షిండే వ్యాఖ్యలు నిర్ణయం తీసుకోవాలన్న దిశలో ఉన్నాయన్నారు. జాప్యం చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. డిసెంబర్ 9 లోపే తెలంగాణ వస్తుందనే ఆశ ఉందని, చివరి ప్రజాస్వామ్య ప్రయత్నంగా ఒక నిర్ణయం తీసుకోవాలని తాము మాట్లాడుతున్నామని, రెండు, మూడు రోజుల్లో చివరిసారిగా హైకమాండ్‌కు లేఖ రాయాలని నిర్ణయించామని, వాస్తవ పరిస్థితులన్నీ అందులో వివరిస్తామన్నారు. అధిష్టానానికి ఇదే ఆఖరి ఛాన్స్ అన్నారు.
తమ భవిష్యత్తు కార్యాచరణ కూడా లేఖలో చెబుతామన్నారు. 12 ఏళ్లుగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. ఈ ఘనతలో తమ పాత్ర కూడా ఉందన్నారు. తెలంగాణ వాదం గెలవాలనే తాము కలుస్తాన్నామని, అందరినీ కలుపుకొనే బాధ్యత కెసిఆర్ మీదే ఉందన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనన్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణ రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications