తనలో మ్యాటర్ లేదన్న నేతకు రాఖీ సావంత్ కౌంటర్

కాగా అంతకుముందు దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో సామాజిక సంస్కర్త అరవింద్ కేజ్రీవాల్‌ను రాఖీ సావంత్‌తో పోల్చారు. కేజ్రీవాల్.. రాఖీ సావంత్ వంటి వాడని, వారిద్దరికీ హడావిడే తప్ప వారిలో ఎలాంటి మ్యాటర్ ఉండదని ట్వీట్ చేశాడు. అయితే ఇది వివాదం అవుతుందని దిగ్విజయ్ ముందే గుర్తించారో ఏమో కానీ కొనసాగింపుగా మరో ట్వీట్ చేశారు. రాఖీ సావంత్‌కు తాను క్షమాపణ చెబుతున్నానని, ఆమెకు తాను అభిమానినని చెప్పారు.
అయితే దిగ్విజయ్ వ్యాఖ్యలకు మాత్రం రాఖీ సావంత్ ఘాటుగానే స్పందించారు. తనను అవసరంగా వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. అంతకుముందు దిగ్విజయ్ అవినీతిపరుల చిట్టా విప్పుతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను దోమతో పోల్చారు. దానికి స్పందించిన కేజ్రీవాల్ తాను డెంగీ దోమనని కౌంటర్ ఇచ్చారు. దీనకి స్పందించిన దిగ్విజయ్ అతనిని రాఖీ సావంత్‌తో పోల్చుతూ... ఇద్దరిలో హడావుడే తప్ప మ్యాటర్ ఉండదన్నారు. దీనిపై ఇంకా కేజ్రీవాల్ మాత్రం స్పందించలేదు.












Click it and Unblock the Notifications