బాల్ థాకరేకు పరామర్శ: గాయపడిన బిగ్ బి, అభిషేక్

Bal Thackeray - Amitab Bachchan
ముంబయి: శివసేన అధినేత బాల్ థాకరేను బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ గురువారం తెల్లవారుజామున పరామర్శించారు. బాల్ థాకరే ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో అమితాబ్, అభిషేక్ శివసేన అధినేత గృహం మాతోశ్రీకి చేరుకొని ఆయనను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

థాకరే త్వరగా కోలుకోవాలని అమితాబ్ ఆకాంక్షించారు. 1982లో కూలీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో తాను గాయపడినప్పుడు.. ఆసుపత్రికి వచ్చి థాకరే తనను పరామర్శించారని అమితాబ్ ట్వీట్ చేశారు. తాను త్వరగా కోరుకోవాలని బాల్ థాకరే తాను గీసిన ఓ కార్డూన్‌ని తనకు అప్పట్లో బహుమతిగా ఇచ్చారని అమితాబ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

బాల్ థాకరేను పరామర్శించేందుకు వెళ్లిన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అమితాబ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. బాల్ థాకరేను చూసేందుకు చాలామంది అభిమానులు రావడంతో వీరు ఇరువురు స్వల్పంగా గాయపడ్డారు. అమితాబ్ కుర్తా కూడా కొద్దిగా చినిగినట్లుగా తెలుస్తోంది.

నిలకడగా బాల్ థాకరే ఆరోగ్యం

పార్టీ అధ్యక్షుడు బాల్ థాకరే ఆరోగ్యం నిలకడగానే ఉందని శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ గురువారం ప్రకటించారు. బాల్ థాకరే ఆరోగ్యంపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గత రాత్రి కంటే ఆయన ఆరోగ్యం ఈ రోజు మెరుగ్గా ఉందన్నారు. థాకరే ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఉద్దవ్ థాకరే కూడా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+