మహిళా టెక్కీ హత్య: కటకటాల వెనక్కి భర్త

రుచి (28) ని చంపడానికి తాను ఢిల్లీ నుంచి వెండి కత్తిని తెచ్చినట్లు 30 ఏల్ల ఆమె భర్త సంజయ్ పోలీసులకు చెప్పాడు. సంజయ్‌కి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆర్థికపరమైన విషయాల్లో తనకు సహాయం చేయనందుకే భార్యను చంపినట్లు అతను చెప్పాడు.
సంజయ్‌పై హత్యా నేరం మోపుతున్నామని, రుచి తల్లిదండ్రులు ఈ కేసులో సాక్షులని కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ఆర్. అశోక్ చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన సంజయ్ ఇంట్లో రుచితో గొడవ పడ్డాడు. గొడవ తీవ్రం కావడంతో చల్లార్చడానికి రుచి తల్లిదండ్రులు జోక్యం చేసుకున్నారు. వారిని సంజయ్ పక్కకు తోసేశాడు.
రుచి తల్లిదండ్రులను, తన మూడేళ్ల కూతురిని బయటకు నెట్టేసి సంజయ్ తలుపులు వేసేసి తాళాలు వేశాడు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. సంజయ్ కత్తిని పట్టుకుని కుర్చీలో కూర్చుని ఉన్నాడు. రుచి మృతదేహం రక్తం మడుగులో పడి ఉంది.
రుచిని చంపిన తర్వాత సంజయ్ తన మణికట్టును కోసుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో అతనికి స్వల్పంగా గాయాలయ్యాయి. నాలుగేల్ల క్రితం సంజయ్, రుచి వివాహం చేసుకున్నారు. సంజయ్ తల్లిదండ్రులు ఢిల్లీ నుంచి ఇంకా బెంగళూర్ చేరుకోవాల్సి ఉంది. రుచి, సంజయ్‌ల కూతురు రుచి తల్లిదండ్రుల వద్ద ఉంది.












Click it and Unblock the Notifications