కిరణ్ రెడ్డి, బొత్స సత్తిబాబు సేఫ్: ఆజాద్ ప్రకటన

మజ్లీస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో ఇక్కడ కేంద్రంలోగాని, అక్కడ రాష్ట్రంలో గాని ప్రభుత్వాలకు వచ్చిన ముప్పు ఏమీ లేదని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే తాను మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో ఫోన్‌లో మాట్లాడానని ఆజాద్ వెల్లడించారు. మళ్లీ ఢిల్లీ వచ్చినప్పుడు ఆసద్ అన్ని విషయాలు చెప్తానని అన్నట్లు ఆయన తెలిపారు. ఆసద్ ఢిల్లీకి వచ్చాక మాట్లాడతామని కూడా ఆయన చెప్పారు.
మజ్లీస్‌తో విభేదాలు తలెత్తిన అనంతరం ముఖ్యమంత్రిని గట్టిగా సమర్ధించిన పిసిసి అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణ రాష్ట్ర వ్యవహారాలపై ఒక నివేదికతో ఢిల్లీ వచ్చినట్టు వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ వ్యాఖ్యలు మరింత ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రిని మారిస్తే మజ్లీస్‌కు భయపడి తలొగ్గినట్లు అభిప్రాయం కలుగుతుందని, దానివల్ల పార్టీ నష్టం జరుగుతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తి ఉన్నప్పటికీ నాయకత్వ మార్పునకు పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ముఖ్యమంత్రిని మార్చాలనే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి పార్టీ నేతలను ఎలా బుజ్జగిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రతిపాదిస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయంపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications