వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహేతర సంబంధం: మరో కుంభకోణం, ఒబామా అండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Barack Obama backs John Allen over David Petraeus sex scandal
వాషింగ్టన్: సిఐఏ చీఫ్ డేవిడ్ పెట్రాస్ వివాహేతర సంబంధం బయటపడిన కొద్ది రోజులకే అలాంటి మరో కుంభకోణం అమెరికాలో వెలుగులోకి వచ్చింది. సిఐఏ చీఫ్‌గా ఉన్న పెట్రాస్ ఇటీవల వివాహేతర సంబంధం ఆరోపణలతో తన పదవికి రాజీనామా విషయం తెలిసిందే. తాజాగా మరో సైనిక ఉన్నతాధికారి జాన్ అలెన్ పైన కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఈ తరహా కుంభకోణాలు అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

పేట్రస్ సెక్స్ కుంభకోణాన్ని విచారిస్తున్న ఎఫ్‌బిఐ బృందం అలెన్ వ్యవహారాన్ని బయటపెట్టింది. జనరల్ అలెన్ మరో వివాహితకు పంపిన ఈ-మెయిల్స్ వెలుగులోకి వచ్చాయి. అలెన్‌కు ముప్పై ఏడేళ్ల సామాజిక కార్యకర్త జిల్ కెల్లీతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఎఫ్‌బిఐ అనుమానిస్తోంది. సిఐఏ మాజీ అధినేత డేవిడ్ పేట్రస్, ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్న బ్రాడ్‌వెల్‌కు జిల్ కెల్లీ స్నేహితురాలు.

తనకు ఈ-మెయిల్ బెదిరింపులు వస్తున్నాయని కెల్లీ ఎఫ్‌బిఐ అధికారులను ఆశ్రయించారు. అవి బ్రాడ్‌వెల్ అకౌంట్ నుంచే వచ్చినట్లు ఫెడరల్ అధికారులు కనిపెట్టారు. ఆ ఈ-మెయిల్‌లను తనిఖీ చేయగా పీట్రాస్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అందులోనే బయటపడింది. అంతేకాదు అలెన్... జెల్లీ కెల్లీకి వందల ఈ-మెయిల్‌లు పంపినట్లు ఎఫ్‌బిఐ అధికారులు తేల్చారు.

అందులో కొన్ని కైపెక్కించే మాటలతో కూడి ఉన్నాయని వారంటున్నారు. అయితే జెల్లీ కెల్లీతో తనకు ఎలాంటి వివాహేతర సంబంధం లేదని అలెన్ వెల్లడించారు. పదోన్నతి కింద నాటో సుప్రీం కమాండర్‌గా అలెన్‌ను అమెరికా ప్రభుత్వం నియమించాల్సి ఉన్నా ఎఫ్‌బిఐ విచారణ కొనసాగుతున్నందున ఆగిపోయింది. కాగా జాన్ అలెన్‌కు అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతుగా నిలిచారు.

English summary

 President Barack Obama backed the top US commander in Afghanistan on Tuesday after the four-star general was dragged into the sex scandal that brought down CIA director David Petraeus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X