ఉరేసుకుని ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్య

విశ్వవిద్యాలయం ఆవరణలోని హిందూ కాలేజీ హాస్టల్‌లోని 112వ నెంబర్ గదిలో అతను ఒక్కడే ఉంటున్నాడు. అతను ఉరేసుకుని ఉండడాన్ని హాస్టల్‌లోని విద్యార్థులు శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో చూశారు. వారు ఆ విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు తెలియజేశారు.
శివ శేఖర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉత్తర ఢిల్లీలోని హిందూ రావు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
శివ శేఖర్ గది నుంచి పోలీసులు క్లాస్ లెక్చర్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లోని ఓ పేజీలో ఇది నా జీవితం అని రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications