ఇప్పుడే దూరం కాను: రాజకీయ ఆరంగేట్రంపై నమిత

కాగా తన అందాలతో దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచుకున్న నమిత సినిమాలకు ఓ నమస్కారం పెట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆమె రాజకీయ ఆరంగేట్రం చేయవచ్చునని అంటున్నారు. నమిత బిజెపిలో చేరి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ రకంగా తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించారనే వాదనలు వినిపించాయి.
సినిమాల్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. సింహ లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు మాత్రమే లభిస్తున్నాయి. దీంతో ఇటీవల ఆమె తమిళ టీవీ చానెళ్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ సభ్య త్వం తీసుకోనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వెలువడ్డాయి.
డీఎంకే, అన్నాడీఎంకేల తో జత కట్టనిదే ఒక్క స్థానమైనా దక్కించుకోలేని స్థితిలో బిజెపి కొట్టుమిట్టాడుతోంది. తమిళనాడులో నమితకు విశేష ఆదరణ ఉది. దీంతో తమిళనాడులో బిజెపి దశను మార్చేందుకు ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సూచనతోనే బీజేపీలో చేరేందుకు నమిత సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
నమిత 1998లో మిస్ సూరత్‌గా ఎంపికైంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో ఆమె నటించింది. ఆమె ఆర్యన్ రాజేష్ సరసన సొంతం సినిమాలో నటించడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. లవ్ కే చక్కర్ మే సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
-
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..! -
ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్.. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ?? -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications