జగన్ జైలుకెందుకెళ్లాడు: సురేఖకు హరీష్, షర్మిల పైనా

Harish Rao
వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి జై కొడితే అవినీతిని ప్రోత్సహించినట్లేనని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు ఆదివారం అన్నారు. ఆయన వరంగల్ జిల్లాలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 25న నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో జరిగే సమర భేరీ సభను విజయవంతం చేయాలని పార్టీకి పిలుపునిచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొన్నట్లుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరని ధ్వజమెత్తారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించని పక్షంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పడుతుందని ఘాటుగా హెచ్చరించారు.

మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ సోదరి షర్మిలా రెడ్డి తెలంగాణపై పార్టీ వైఖరి ప్రకటించిన తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు ఎందుకు వెళ్లారో మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ వివరణ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+