జగన్ పార్టీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్: సంకేతాలిచ్చిన ఎంపి

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తమకు గాడ్ ఫాదర్ అని, ఆయన అంటే తమకు విపరీతమైన అభిమానమన్నారు. రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. దీనికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం కూడా ఓ కారణమే అన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరు వచ్చినా పరిస్థితి బాగుపడదన్నారు. కేంద్రం గతంలో ప్రకటించిన తెలంగాణ ఇస్తేనే కాంగ్రెసు పార్టీలో కొనసాగుతామని చెప్పారు.
డిసెంబర్ 9వ తేదీలోగా కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఇస్తేనే కాంగ్రెసు బతికిబట్టకడుతుందన్నారు. అవసరమైతే జగన్‌కు అండగా నిలబడతామన్నారు. వైయస్ సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా జగన్ వల్లే సాధ్యమన్నారు. జగన్‌ను అన్యాయంగా జైలులో పెట్టారన్నారు.












Click it and Unblock the Notifications