హిందుత్వ హీరో బాల్ థాకరేకు ముస్లిం వైద్యుడి చికిత్స

Bal Thackeray
ముంబయి: తనువంతా ఆదర్శ హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకున్న స్వర్గీయ శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరేకు ఐదేళ్ల పాటు ఓ ముస్లిం వైద్యుడు చికిత్స అందించారు. థాకరే రెండు రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన మృతిని ప్రకటించింది కూడా ఆ వైద్యుడే. అతడి పేరు జలీల్ పార్కర్. జలీల్ పార్కర్ ఐదేళ్లుగా థాకరేకు వైద్య సేవలు చేస్తున్నారు. చివరి నిమిషం వరకు థాకరేకు ఆయన వైద్య సేవలు అందించారు.

థాకరేకు జలీల్ అంటే ప్రత్యేకమైన విశ్వాసం. ఇతడు లీలావతి ఆసుపత్రిలో ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్య నిపుణుడు. థాకరేకు నమ్మకమైన వైద్యుడిగా ఆయన ఇన్నేళ్లుగా కొనసాగారు. థాకరే మృతిని జలీల్ కన్నీటి పర్యంతమై ప్రకటించారు. కొన్నేళ్ల క్రితం శ్వాస సంబంధమైన వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన థాకరేకు జలీల్ విజయవంతంగా చికిత్స చేశారు.

థాకరేతో పాటు ఆయన కుటుంబ సభ్యుల విశ్వాసాన్ని కూడా జలీల్ పొందారు. ఈ ఐదేళ్లలో జలీల్ పార్కర్ శివసేన అధినేత ప్రాణాలను ఐదుసార్లు కాపాడారట. థాకరేకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆయనే వైద్యం చేసేవారు. థాకరే తనయుడు ఉద్దవ్ థాకరేకు గుండె శస్త్ర చికిత్స కూడా జలీల్ సారథ్యంలోని వైద్య బృందమే నిర్వహించింది.

హిందుత్వవాది అయిన థాకరే వ్యక్తిగత వైద్యుడు ఓ ముస్లిం వ్యక్తి ఉండటంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తినా... జలీల్ ఏమాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాదు థాకరే తనను ఎంతగానో ఆదరిస్తారని సమాధానం చెప్పేవారు. జలీల్... థాకరే కుటుంబానికి ఎంత సన్నిహితుడు అంటే ఈ సంవత్సరం పార్టీ తరఫున జరిగిన దసరా వేడుకల్లో ఆయనకు డయాస్ పైన సీటు కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+