రేప్ చేయబోయిన వ్యక్తి నాలుక కొరికేసిన అమ్మాయి

అతని ఘాతుకాన్ని గమనించిన సదరు యువతి వెంటనే తనను తాను రక్షించుకునేందుకు ఆ యువకుడి నాలుకను తన పళ్లతో రెండు ముక్కలుగా కొరికేసింది. ముక్కలై రక్తం కారుతున్న నాలుకతో ఆ యువకుడు వెంటనే బయటకు పరుగెత్తాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
తీవ్ర గాయంతో బాధపడుతున్న అతనిని వెంటనే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. యువతి కొరకడంతో నాలుకలోని కొద్ది భాగం పోయందని, ఆ యువకుడు జీవితాంతం స్పష్టంగా మాట్లాడలేడని వైద్యులు తెలిపారు. తాను నాలుక కొరికనందుకు పశ్చాత్తాప పడటం లేదని, అలాంటి దుర్మార్గుడు తనపై అత్యాచార యత్నం చేయబోయినప్పుడు తప్పని పరిస్థితుల్లో నాలుక కొరికానని తెలిపింది.
భవిష్యత్తులో తనకు ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఇలాగే చేస్తానని ఆమె చెప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైలాష్ బహేలియా ఫుర్రా సాలెంపూర్‌లోని యువతి ఇంటిలోకి చొచ్చుకెళ్లి ఆమెను అత్యాచారం చేయబోవడంతో ఆమె అతని నాలుకను కొరికిందని చెప్పారు.












Click it and Unblock the Notifications