నగరంలో భారీ అగ్ని ప్రమాదం: చిన్నారి సజీవ దహనం

Hyderabad
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బండ్లగూడలోని సన్ సిటీ సమీపంలోని పి అండ్ టి కాలనీలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో దాదాపు యాభై నుండి అరవై వరకు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించినట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ఓ గుడిసెలో నిద్రిస్తున్న ఓ చిన్నారి సజీవ దహనమైనట్లుగా సమాచారం. ఈ గుడిసెలలో ఉండే వారంతా భవన నిర్మాణ కార్మికులు. వారంతా పనికి వెళ్లిన సమయంలో సాయంత్రం ఇది జరిగింది. గుడిసెలలో ఎక్కువ మంది లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

విజిలెన్స్ తనిఖీలు

గుంటూరు జిల్లా మంగళగిరి - తెనాలి క్రాస్ రోడ్డు వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు ప్రకాశం జిల్లా మార్టూరు నుండి తూర్పు గోదావరి జిల్లా మండపేటకు రెండు లారీలలో తరలిస్తున్న ఆరువందల బస్తాల చౌక బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+