గడ్కరీకి మరిన్ని కష్టాలు: యశ్వంత్ సిన్హా ఫైర్

Yashwant Sinha
న్యూఢిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ మరింతగా కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవలి సంక్షోభం నుంచి ఆయన బయటపడినప్పటికీ తాజాగా మరో గండం వచ్చి పడింది. నితిన్ గడ్కరీపై బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తీవ్రంగా విరుచుకుపడ్డారు. గడ్కరీ రాజీనామా చేయాల్సిందేనని ఆయన అన్నారు.

పార్టీ అధ్యక్ష పదవి నుంచి గడ్కరీ తక్షణమే తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గడ్కరీ తప్పు చేశారా, లేదా అనేది చర్చనీయాంశం కాదని, అటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన స్థితిలో ప్రజా జీవితంలో ఉన్నవారు ఉండకూడదని ఆయన అన్నారు.

పూర్తి షుగర్, పవర్ గ్రూప్‌లకు సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గడ్కరీ రాజీనామా చేయాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు రాంజెత్మలానీ, ఆయన కుమారుడు మహేష్ చేసిన డిమాండ్ యశ్వంత్ సిన్హా తాజా ప్రకటనతో మళ్లీ ముందుకు వచ్చింది.

నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని ఇటీవల కొద్ది మంది బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ స్థితిలో ఆర్ఎస్ఎస్ రంగప్రవేశం చేసి పరిస్థితిని గడ్కరీకి అనుకూలంగా మలిచిందని అంటున్నారు. దీంతో గడ్కరీ రాజీనామా చేయాలని అభిప్రాయపడిన నేతలు కూడా చల్లబడి వెనక్కి తగ్గారని సమాచారం. పదవీ కాలం ముగిసే వరకు పదవిలో కొనసాగడానికి గడ్కరీకి ఏ విధమైన ఆటంకాలు ఉండవని భావించారు. కానీ, యశ్వంత్ సిన్హా ప్రకటనతో ఆయన మరోసారి చిక్కుల్లో పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+