జగన్‌తో పాటు భారతి, షర్మిలనీ జైల్లో పెట్టాలి: గాలి

వారిపై కూడా కేసులు పెట్టి జైలులో పెట్టాలన్నారు. ఇతర పార్టీలో ఎమ్మెల్యేలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. ఇతర పక్షాలపై నిప్పులు చెరుగుతూనే వారు మరోవైపు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల కోసమే ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి వెళ్తున్నారని మరో నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. వెళ్లినంత మాత్రాన తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు.
మెదక్‌లో చంద్రబాబు...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర గురువారం మెదక్ జిల్లా అంతారం నుండి ప్రారంభమైంది. ఈ రోజు 48వ రోజు. ఈ రోజు పదహారు కిలోమీటర్లు నడుస్తారు. పాదయాత్ర ప్రారంభం సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ... ఎవరి మద్దతు లేకున్నా కేంద్రం అణు ఒప్పంద బిల్లును ఆమోదించిందని, అందరూ ఒప్పుకున్నప్పటికీ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని ప్రశ్నించారు.
పిల్లా కాంగ్రెసుకు చెందిన పత్రికలో గీత కార్మికులను అవమానించేలా రాతలు వచ్చాయన్నారు. బెల్టు షాపులను రద్దు చేస్తానని తాను చెప్పానని, కానీ గీత కార్మికులను కూడా ఆ పత్రిక కలిపిందని మండిపడ్డారు. కల్లుకు, బెల్టు షాపులకు సంబంధం లేదన్నారు. కల్లుని నిషేధిస్తానని తాను చెప్పలేదన్నారు. వైయస్ ఉన్నప్పుడు గీత కార్మికుల పొట్ట కొట్టాడన్నారు. అప్పుడు రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే గీత కార్మికులకు లైసెన్సులు ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications