ఏమంటే ఏమవుతుందో: ఎమ్మెల్యేల ఒత్తిడిలో చంద్రబాబు

దీనిని తొలగించి, 2014లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. అనుకున్నట్లుగానే బాబు యాత్రతో టిడిపిలో నూతన ఉత్తేజం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో దాదాపు చచ్చిపోయిందనే పరిస్థితి నుండి తెలంగాణవాద పార్టీలకి ధీటుగా క్రమంగా పుంజుకుంటోంది.
బాబు యాత్రకు స్పందన బాగా వస్తున్నప్పటికీ... ఆయనకు పార్టీ నేతల నుండి అంతగా సహకారం లభించినట్లుగా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. బాబు వస్తున్నా మీకోసం యాత్రకు మద్దతుగా నియోజకవర్గ నేతలు పల్లె పల్లెకు టిడిపిని ప్రారంభించారు. దీనిపై చంద్రబాబు తన అసంతృప్తిని ఇటీవలె తెలియజేశారు. ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గ ఇంచార్జులు పలువురు దీనిపై పెద్దగా స్పందించక పోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఓ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా నియోజకవర్గం పనుల పైనా టిడిపి ఎమ్మెల్యేలు పలువురు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారట. ఈ విషయం తెలిసినప్పటికీ బాబు వారిని ఏమీ అనని పరిస్థితి ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేల పని తీరుపై మాట్లాడని పరిస్థితి బాబుకు ఉందని అంటున్నారు. కొందరి పని తీరు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చినా గెలవలేని పరిస్థితి ఉందట. ఇప్పటికిప్పుడు వారిని కూడా ఏమీ అనలేని పరిస్థితి ఉందని అంటున్నారు.
ఎవరిని ఏమంటే ఏ పార్టీలో చేరుతారో, ఏ ప్రజాప్రతినిధి ఎవరితో టచ్‌లో ఉన్నారో, పనుల పైనా, పార్టీ కార్యక్రమాల పైన ఒత్తిడి పెంచితే ఎక్కడ చేజారిపోతారో అనే ఆందోళన బాబుకు ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే బాబు ఏమీ అనకుండా ఉండటంతో కొందరు ఎమ్మెల్యేల్లో మరింత నిర్లక్ష్యాన్ని పెంచుతోందట.












Click it and Unblock the Notifications