జగన్, గాలి రిమాండ్ వచ్చే నెల 5 వరకు పొడగింపు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎమ్మార్ ప్రాఫర్టీస్ అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు ప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి బిపీ ఆచార్య గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. అలాగే జగతి పబ్లికేషన్స్ వైస్ ఛైర్మన్ విజయసాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు.
ఇదిలావుంటే, ఒఎంసి కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సిబిఐ కోర్టులో గురువారం సాయంత్రం వాదనలు పూర్తయ్యాయి. వాదోపవాదాలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వివిధ కేసుల్లో నిందితులైన విఐపి ఖైదీలంతా చంచల్‌గుడా జైలులోనే ఉన్నారు. వైయస్ జగన్‌ను సిబిఐ మే 27వ తేదీన అరెస్టు చేసింది. ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణను సిబిఐ అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications