'జగన్ పార్టీలోకి 70 మందికి పైగా ఎమ్మెల్యేలు'

ఆయన మరణంతో రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. రాష్ట్రంలో చాలామంది ప్రజలు వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నారన్నారు. వందకు పైగా ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజలు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్న విషయం ప్రజాప్రతినిధులకు అర్థమవుతోందని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చేందుకు 70 మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కృష్ణా జిల్లాలో ఆ పార్టీ నేత, కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను అన్నారు. కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. ఓ వైపు తుగ్లక్ పాలన అంటున్న బాబు అవిశ్వాసం పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications