అవిశ్వాసంపై మమతకు హ్యాండ్: మద్దతులేక తిరస్కరణ

ఎంపీల మద్దతు కూడగట్టడంలో తృణమూల్ విఫలమైంది. మమత బిజూ జనతాదళ్(బిజెడి)పై నమ్మకం పెట్టుకొని అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టించింది. కానీ చివరి నిమిషంలో బిజెడి మమతకు ఝలక్ ఇచ్చింది. బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తృణమూల్ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తానని చెప్పారు. కానీ ఎలాగూ వీగిపోతుందని తెలిసి నవీన్ మద్దతు ఇచ్చేందుకు విముఖత చూపినట్లుగా కనిపిస్తోంది.
ఇద్దరు ముగ్గురు బిజెడి ఎమ్మెల్యేలు మద్దతిచ్చినప్పటికీ తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో స్పీకర్ తిరస్కరించారు. కాగా ఎఫ్‌డిఐల పైన విపక్షాలు లోకసభను అట్టుడికించాయి. తాము ఇచ్చిన తీర్మానాలపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విపక్షాలు పట్టుబట్టడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. కాగా అంతకుముందు పదకొండు గంటలకు ప్రారంభమైన సభ మొదటిసారి 12 గంటల వరకు, ఆ తర్వాత రెండోసారి 12.30 గంటల వరకు వాయిదా పడింది.
తిరిగి ప్రారంభమైనా కొద్ది నిమిషాల్లో వాయిదా పడింది. అంతకుముందు పన్నెండు గంటలకు ప్రారంభమైన రాజ్యసభ విపక్షాలు ఎఫ్‌డిఐలపై పట్టుబట్టడంతో చైర్మన్ సభను రేపటి వరకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications