లండన్ విచిత్రం: దిగంబరంగా విగ్రహంపై వ్యక్తి విన్యాసాలు

నవంబర్ చలిని, జనాల చూపులను లెక్క చేయకుండా అతను విగ్రహంపై నగ్నంగా కనిపించాడు. ఈ విగ్రహం ప్రిన్స్ జార్జీది. జార్జి 19వ శతాబ్దంలో మిలిటరీ చీఫ్‌గా పనిచేశాడు. ఓ సమయంలో కేంబ్రిడ్జీ డ్యూక్‌గా కూడా ఉన్నారు. ప్రిన్స్ తలపై తనను తాను తౌల్యం చేసుకుంటూ దిగంబరుడు భంగిమలు పెట్టాడు.
వైట్‌హాల్‌లోని ఆ విగ్రహం వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఇక్కడే కామెరోన్ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలున్నాయి. విగ్రహంపైకి ఎక్కిన వ్యక్తి వద్ద కత్తి ఉండవచ్చునని భావించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆ విగ్రహంపై అతను విన్యాసాలు చేశాడు.
అతన్ని కిందికి దింపడానికి పోలీసులు తీప్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు మూడు గంటల ప్రాంతంలో అతడు కిందికి దిగి వచ్చాడు. అతన్ని పోలీసులు మానసిక ఆరోగ్య చట్టం కింద అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications