షాపింగ్‌మాల్‌లో అగ్ని ప్రమాదం: 121 మంది మృతి

మంటలు భారీగా ఎగిసిపడటంతో భవనంలోని పలు అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనం పైనుండి దూకారు. విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం వరకు 112 మృతదేహాలను వెలికి తీశారు.
ప్రమాదంలో పది మంది వరకు మృతి చెంది ఉంటారని, వందకు పైగా గాయపడ్డారని తొలుత భావించారు. కానీ ఈ రోజు ఉదయం 112 మృతదేహాలు వెలికి తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.
కాగా చైనాలో రెండు వేరువేరు సంఘటనలలో గ్యాస్ పేలుళ్లు సంభవించి ముప్పై రెండు మంది దుర్మణం చెందారు. మరో నలభై ఏడు మంది తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications