కెసిఆర్ ఎక్కడి నుంచో ఊడిపడలేదు: చంద్రబాబు

మామ (కెసిఆర్), అల్లుడు (హరీష్ రావు), కొడుకు (కెటిఆర్)లకు ఉద్యోగాలు వస్తే సరిపోతుందా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండి ఒక్క కార్మికుడికైనా ఉద్యోగాలు ఇప్పించారా అని చంద్రబాబు అడిగారు. తెరాస నాయకులు మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజా సమస్యలను వారు ఒక్కనాడైనా పట్టించుకోలేదని ఆయన అన్నారు. మోకాళ్లపై నడిచినా చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజలు నమ్మరనే కెసిఆర్ మాటలను గుర్తు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకా అని చంద్రబాబు అడిగారు.
తెలంగాణ సాధించడమంటే మాటల గారడీ చేయడమేనా అని కెసిఆర్‌ను ఆయన అడిగారు. గత 12 ఏళ్లుగా ఇదిగో, అదిగో తెలంగాణ అంటూ కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ మాటల గారడీతో కడుపు నిండదని, మాటల గారడీతో రెచ్చగొట్టి తెరాస ఓట్లు దండుకకెసిఆర్ ఎక్కడి నుంచో ఊడిపడలేదుఆయన వ్యాఖ్యానించారు. తెరాస నేతలు మాటల గారడీతో మోసం చేస్తారని ఆయన అన్నారు.
కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా, కార్మికుల సమస్యలను పరిష్కరించారా అని ఆయన అడిగారు. పిల్ల కాంగ్రెసు (వైయస్సార్ కాంగ్రెసు) అవినీతిలో కూరుకుపోయిందని, తొమ్మిదేళ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆయన ఆరోపించారు. కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేని కెసిఆర్ ఇంటికో ఉద్యోగం ఎలా ఇస్తారని ఆయన అడిగారు. బీడీ కార్మికుల పొట్టను కొట్టింది కెసిఆర్‌యేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications