రాయలసీమ గుండాలతో షర్మిల పాదయాత్ర: ఎర్రబెల్లి

కాంగ్రెసుతో కెసిఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పటికీ ఉందని, సూర్యాపేట సమరభేరీ సభలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించకపోవడమే అందుకు నిదర్సమని ఆయన అన్నారు. తమ పార్టీలోకి రావాలని తెలుగుదేశం శానసశభ్యులకు కెసిఆర్ ఫోన్లు చేస్తున్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను బతిమాలుతున్నారని అన్నారు. తమ పార్టీలోకి వస్తే మళ్లీ గెలిపిస్తామని కెసిఆర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు చెబుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్‌పై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు ఇ. పెద్దిరెడ్డి హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో కెసిఆర్ చెన్నారెడ్డిని మించిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నారెడ్డి ఒకేసారి మోసం చేస్తే కెసిఆర్ దశలవారీగా మోసం చేస్తున్నారని అన్నారు. పోలవరం, పులిచింతల ప్రాజెక్టులు ప్రారంభమైనప్పుడు కెసిఆర్ ఏం చేశారని ఆయన అడిగారు.
కెసిఆర్ సూర్యాపేట సభపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. సూర్యాపేట సభలో కెసిఆర్ కార్యాచరణ ప్రకటిస్తారేమోనని తెలంగాణవాదులు ఆశపడితే వారి ఆశలను నీరుగార్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కార్యాచరణ పక్కన పెట్టి, ఎన్నికల వాగ్దానాలకే కెసిఆర్ పరిమితమయ్యారని వారన్నారు. కెసిఆర్‌కు బతుకుదెరువు పోరాటమే తప్ప తెలంగాణ రాష్ట్ర సాధనపై ఆరాటం లేదని వారు వ్యాఖ్యానించారు.
కెసిఆర్‌కు నచ్చినప్పుడే ఉద్యమం అన్నట్లు వ్యవహరిస్తున్నారని వారన్నారు. ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో ఢిల్లీ వెళ్లి కూర్చుంటారని, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు సభలు నిర్వహిస్తున్నారని వారన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టాలని సభలో కెసిఆర్ ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం బాధాకరమని వారన్నారు.












Click it and Unblock the Notifications