ఖమ్మం నుండి పోటీకి సిద్ధమా: కెసిఆర్‌కు నామా సవాల్

కెసిఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుండి పోటీ చేయాలని సవాల్ చేశారు. అప్పుడు ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దామన్నారు. ఉద్యమం పేరు చెప్పుకొని డబ్బులు దండుకుంటున్నాడన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కెసిఆర్‌కు నాగేశ్వర రావు సవాల్ విసిరారు.
వైద్యం, విద్య సహా అన్ని రంగాలలో టిడిపి హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణలో తమ పార్టీని ప్రజలు నమ్ముతారో లేదో కెసిఆర్ ఖమ్మం నుండి పోటీ చేసేందుకు సిద్ధమైతే తెలుస్తుందన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేట సభలో కెసిఆర్ తెలుగుదేశం పార్టీపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.












Click it and Unblock the Notifications