కెసిఆర్‌తో విభేదాల్లేవు: సభకు డుమ్మాపై రాములమ్మ!

అందుకే పార్టీ నల్గొండ జిల్లా సూర్యాపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమరభేరికి రాలేకపోయానని చెప్పారు. తాను బహిరంగ సభకు రాలేకపోతున్న విషయాన్ని పార్టీ అధినేతకు తాను ముందుగానే తెలియజేశానని చెప్పారు. అనారోగ్యం కారణంగా రాకపోయినా విభేదాలు అంటూ ప్రచారం చేయడం సరికాదని ఆమె అన్నారు.
కాగా గతంలో పలుమార్లు విజయశాంతి, కెసిఆర్ మధ్య విభేదాలు పొడసూపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని పార్టీ సమావేశాల్లో, బహిరంగ సభల్లో కెసిఆర్‌తో పాటు విజయశాంతి పాల్గొనక పోవడం, కొన్ని సమయాల్లో విజయశాంతికి మాట్లాడక పోవటానికి అనుమతించలేదనే వార్తలు రావడం... ఇలా పలుమార్లు వారి మధ్య విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications