వైయస్ జగన్‌కు రోజా దూరం: ఎక్కడా ఇమడలేరా?
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి రోజా ఏ పార్టీలోనూ ఇమడలేరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడా ఆమె దూరమైనట్లు ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత ప్రత్యర్థులను తన వాగ్ధాటితో అదరగొట్టిన ఆమె ఇప్పుడు చడీచప్పుడు చేయడం లేదు. ఉన్నట్లు లేనట్లు అలా కనిపించి, ఇలా వెళ్లిపోతున్నారు.

రాజకీయాలకు దూరమైన ప్రముఖ సినీ నటి రోజా టీవీ షోల్లో యాంకర్‌గా ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రేక్షకులను అలరించే టీవీ షోల్లో ఆమె తన సత్తా చాటుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తొలుత రోజా చాలా చురుగ్గా వ్యవహరించారు. తన మాటల ఈటెలతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. వైయస్ జగన్ తిరుపతి పర్యటన సందర్భంగా ఆమె ఇలా కనిపించారు.

తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా రోజా వివిధ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ఆందోళనల సందర్భంగా ధర్నాలు చేశారు, అధికారులకు వినపతిపత్రాలు సమర్పించారు. చుట్టూ మహిళలతో ఆమె సందడిగా కనిపించేవారు.

రోజా ఎక్కడున్నా సందడే. తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో రోజా సందడి చేస్తూ ఇలా కనిపించారు.

2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి తన అభిమతాన్ని వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీలో రోజాది అప్పట్లో ప్రధానమైన పాత్రనే. ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి అప్పట్లో ఇలా ప్రతిజ్ఞ తీసుకున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఆందోళనలతోనే కాదు, తన నాట్యప్రదర్శనతో కూడా ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె తన పార్టీ కార్యక్రమాలు సందడిగా ఉండడానికి ఇలా డ్యాన్స్‌లు కూడా చేస్తుండేవారు.
తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన రోజా ఆ తర్వాత దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో ఆ పార్టీకి దూరమయ్యారు. అప్పుడే కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఆమె వైయస్ జగన్ వైపు వచ్చారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.
రోజా తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ సమయంలో వివిధ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా హడావిడి చేశారు. ఆందోళనలు చేపట్టి మహిళలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత ఉప ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితులైన నాయకుల్లో ఆమె కూడా ఒకరిగా ముద్రపడ్డారు. కానీ, ఈ మధ్య ఆమె జగన్‌కు దూరమైనట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆమె దూకుడే ఆమెకు రాజకీయ పార్టీల్లో కష్టాలు తెచ్చిపెడుతున్నట్లు భావిస్తున్నారు.
ఇతర నాయకులకు ఆమె దూకుడు ప్రమాదంగా పరిణమించడం వల్ల ఆమెకు అంతర్గత ప్రత్యర్థులు పెరుగుతున్నారని, దాంతో పార్టీకి దూరం చేసే ప్రయత్నాలను వారు ముమ్మరం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఇటువంటి రోజాలాంటి చురుకైన నాయకులు నెగలలేరనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications