తెలంగాణ: కూల్‌గా ఉండమన్న సోనియా, రాహుల్

దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడ్డాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సోనియా, రాహుల్ గాంధీలను పార్లమెంటు లాబీలో కలిశారు. తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందని, ఈ అంశాన్ని వెంటనే తేల్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిని తేల్చకుంటే ఆ ప్రాంతంలో తెలంగాణకు నష్టం జరుగుతుందని వారికి నచ్చజెప్పారు.
వారి మాటలను ఆలకించిన సోనియా, రాహుల్‌లు తెలంగాణ అంశంపై తాము ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిని తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే అప్పటి వరకు పార్టీకి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించవద్దని సూచించారు. అందుకు ఎంపీలు... తెలంగాణ గురించి సభలో మాట్లాడేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఆమెకు నోట్ ఇచ్చారు. అలాగే తెలంగాణపై వివరించేందుకు తమకు అపాయింటుమెంటు కూడా ఇవ్వాలని కోరారు.
అపాయింటుమెంటుపై సోనియా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. అయితే అప్పటి వరకు కూల్‌గా ఉండాలని పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని సూచించారు. సోనియా హామీతో వారు కూల్ అయ్యారు. సోనియాను కలిసిన వారిలో పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, వివేక, మంద జగన్నాథం తదితర ఎంపీలు ఉన్నారు.
కాగా పన్నెండు గంటలకు తిరిగి ఉభయ సభలు ప్రారంభమైనప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై విపక్షాలు సభను అడ్డుకున్నాయి. దీంతో లోకసభను స్పీకర్, రాజ్యసభను చైర్మన్ మంగళవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications