సూర్యాపేట సభ ఎఫెక్ట్: కెసిఆర్‌పై జగన్ పార్టీ ఫైర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమరభేరి బహిరంగ సభ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శల జోరు పెంచారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఆభాసు పాలు చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని జిట్టా బాలకృష్ణా రెడ్డి కెసిఆర్‌ను హెచ్చరించారు సూర్యాపటే సభ ఆ తెరాస ఉనికి కోసమే తప్ప ప్రజల కోసం కాదని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం బలిదానాలు చేసినవారిన మీద ఆధారపడి ప్రయోజనం పొందాలని తెరాస చూడడం హేయమైన చర్య అని సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ వస్తే రెండు రాష్ట్రాల్లో తమ పార్టీయే ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి తెరాస ఆదరణ కోల్పోతుందనే భయంతోనే అనవసర ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన అన్నారు.

పులిచింతల ప్రాజెక్టు పురుడు పోసుకున్న సమయంలో తెరాస కూడా మంత్రివర్గంలో ఉందని, అప్పుడు ఎందుకు నోరు విప్పలేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే బీబీనగర్‌కు నిమ్స్ వచ్చిందని ఆయన అన్నారు. వక్ఫ్ భూములపై కెసిఆర్ పోరాటం ఏమైందని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖఱ రెడ్డి మరణించి మూడున్నరేళ్లు అయిందని, ఇప్పుడు తెలంగాణను ఎవరు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.

ప్రత్యేక తెలంగాణపై తెరాస అధ్యక్షుడు కెసిఆర్ చేసే ప్రకటనలన్నీ పొంతన లేనివేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సంకినేని వెంకటేశ్వర రావు అన్నారు. తెలంగాణ ఇస్తాం చర్చలకు రావాలని కెసిఆర్‌ను ఎవరు పిలిచారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టి పోలవరం కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆయన కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. ఈ విషయం పత్రికల్లో వచ్చిందని గుర్తు చేశారు.

దివంగత స్వాతంత్ర్య యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే తెరాస ఆవిర్భావం జరిగిందని, కెసిఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు కూడా అర్పించలేదన ఆయన అన్నారు. తెలంగాణ అమర వీరుల పేరు చెప్పుకుని కెసిఆర్ కాయలు అమ్ముకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టెన్ జనపథ్‌లో కెసిఆర్ నిలువునా అమ్మేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో నాయకుడు రెహ్మాన్ వ్యాఖ్యానించారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన వైయస్ రాజశేఖర రెడ్డిపై అవాకులు చవాకులు పేలితే నాలుక తెగకోస్తామని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు, తెరాస శాసనసభ్యుడు కెటి రామారావుకు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+