తెలంగాణ కోసం మరో విద్యార్థి అత్మబలిదానం

Another student commits suicide for Telangana
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం కోసం మరో విద్యార్థి బలిదానం చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాదరి రమేష్ (16) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఎప్పుడూ తెలంగాణ అంశంపైనే మాట్లాడుతుండేవాడు.

తెలంగాణ రావటం లేదనే మనస్తాపంతో ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ తండ్రి గాదరి మారయ్య ఫిర్యాదు మేరకు టుటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో చూరుకుగా పాల్గొంటున్న రమేష్ గత రెండు రోజులుగా నల్లగొండలోని పానగల్, పరిసర ప్రాంతాల్లో తెలంగాణ జెండాలతో ప్రచారం సాగించాడని అతని బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సూర్యాపేటలో జరిగే సభకు వెళ్లాకుండా తీవ్ర మనస్తపంతో రమేష్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని తల్లిదండ్రులు గాదరి మారయ్య, రాణమ్మలు శోకసముద్రంలో మునిగిపోయారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ సమరభేరీ బహిరంగ సభ ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లాలోనే జరిగింది. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో జరిగిన ఈ సభకు వెళ్లకుండా రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+