టివి షోలకే పరిమితం! శివుడి ఆజ్ఞతోనైనా: మళ్లీ 'ఢీ'ఎల్

DL Ravindra Reddy
కడప: నేతలు టివిలలో బొమ్మలు చూపించుకొని ప్రకటనలకు పరిమితం అవుతున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సోమవారం విమర్శించారు. కార్తీక మాస సోమవారం సందర్భంగా ఆయన కడప జిల్లాలోని కాజీపేట నాద నాగేశ్వరకోన ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శివును ఆజ్ఞతో పాలకులలో కనువిప్పు కలిగి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

ఇటీవల నీలం తుఫాను కారణంగా కొన్ని జిల్లాలు వరదలతో, వర్షాలు లేక మరికొన్ని జిల్లాలు వర్షాభావంతో అల్లాడుతుంటే కొందరు నేతలు మాత్రం టీవిలలో తమ బొమ్మలు చూపించుకొని ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారని విమర్శించారు. నాద నాగేశ్వర కోన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏకవ్యక్తి పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

కేవలం తనకు అనుకూలంగా ఉన్న మంత్రులకు, ప్రజాప్రతినిధులకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని, ఇతరులకు కేటాయించడం లేదని ఆరోపించారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిఎల్‌ల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

రెండు రోజుల క్రితం ధర్మాన ప్రసాద రాజీనామాను మంత్రివర్గం ఆమోదించినప్పుడు డిఎల్ మాత్రం వ్యతిరేకించారు. దీనిపై ధర్మాన ఆదివారం విశాఖలో డిఎల్‌కు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తమ పార్టీలో ఒక మంత్రి ఏం చేస్తాడో మరో మంత్రి నిరంతరం కనిపెడతారని, ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడో మరో ఎమ్మెల్యే గమనిస్తుంటాడని, ముఖ్యమంత్రి విషయం కూడా అంతేనని, తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అన్నారు.

ఇలా సహచరులపై కన్నేసి ఉంచడం ద్వారా ప్రజలపై భారం తగ్గుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాటి వల్ల మాకు మేం నష్టపోతామే కానీ ప్రజలు ఏమాత్రం నష్టపోరని లాజిక్ లాగారు. ముఖ్యమంత్రిపై సైతం కొంతమంది ఫిర్యాదులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని, మరే రాజకీయ పార్టీలోనూ ఇటువంటి వాటికి అవకాశం ఉండబోదని అన్నారు. అయితే ధర్మాన ఈ కామెంట్స్ ద్వారా మరో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలపై నేరుగా కాకుండా పరోక్షంగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+