కొత్తపేటలో ప్రత్యంగిరా ఆలయ ముఖ ద్వారం ప్రారంభం!

ఈ ఆలయ స్వాగత ద్వారం(మహా ద్వారం) భక్తుల నుండి వచ్చిన విరాళాలతో నిర్మించినట్లు చెప్పారు. పలువురు భక్తుల నుండి సుమారు నాలుగు లక్షల రూపాయలు అందాయని, వాటితో నిర్మించినట్లు చెప్పారు. కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారి చేతుల మీదుగా స్వాగత ద్వారం ప్రారంభింప చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి, జస్టిస్ నూతి రాంమోహన్ రావు, ఆంధ్రప్రభ మాజీ సంపాదకులు, రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ పొత్తూరు వెంకటేశ్వర రావు తదితదిర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications