తెలంగాణ వద్దని...: జగన్‌పై కెటిఆర్ నోట టిడిపి మాట!

ఈ సమయంలో ఆయన నోట తెలుగుదేశం పార్టీ మాట వచ్చింది! వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇవ్వవద్దని... అవసరమైతే మీకు మద్దతిస్తామని కాంగ్రెసుతో జగన్ చెబుతున్నారని ఆరోపించారు. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్న జగన్‌ను తాము తెలంగాణ వ్యతిరేకిగానే గుర్తిస్తామన్నారు.
విజయమ్మ లేదా చంద్రబాబులు తెలంగాణ ఇవ్వాలని ప్రధానమంత్రి చెప్పినా... లేఖ రాసినా తాను, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావులు రాజకీయాల నుండి తప్పుకుంటామని సవాల్ విసిరారు. రాజన్న రాజ్యం అంటే సీమాంధ్రకు పండగ, తెలంగాణకు దండుగ అని షర్మిల వ్యాఖ్యలపై ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇటుకలతో కొడితే తాము రాళ్లతో కొడుతామని కెటిఆర్ తెలుగుదేశం పార్టీని హెచ్చరించారు.
టిడిపి అధికారంలోకి వస్తే బాబు తప్ప ఎవరూ ముఖ్యమంత్రి అయ్యేది ఉండదన్నారు. నడిచి నడిచి బాబు మెదడి దెబ్బ తిన్నదన్నారు. కాంగ్రెసుకు పార్టీకి అవకాశమిస్తే జీవితాంతం తెలంగాణపై చర్చలు అంటారన్నారు. మభ్యపెట్టడం కాంగ్రెసుకు అలవాటే అని విమర్శించారు. బాబు, కెసిఆర్ ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. స్టే తెచ్చుకునే పిరికివాళ్లం తాము కాదన్నారు. ఇందిరాపార్కు వద్ద 29న దీక్షా దివస్ ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications