కెసిఆర్! ఏంచేశావ్, కాళ్లుపట్టుకొని సారీ చెప్తావా: షర్మిల

మహబూబ్ నగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన, కాంగ్రెసు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. స్థానిక మంత్రి డికె అరుణ పైనా ఆమె చిందులు తొక్కారు. జిల్లాకు చెందిన మంత్రి కారణంగానే పరిస్థితి ఇలా ఉందని ఆమె మండిపడ్డారు.

Sharmila

ప్రజా సమస్యలను తెరాస ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణపై ప్రేమ లేదని కెసిఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్‌కు తెలంగాణపై ప్రేమ లేకుంటే చేవెళ్ల నుండి పాదయాత్ర చేసే వారా అని, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తలపెట్టేవారా అని, ప్రతి పథకాన్ని తెలంగాణ నుండే ప్రారంభించే వారా అని షర్మిల... కెసిఆర్‌ని ప్రశ్నించారు.

ప్రాణహిత ప్రాజెక్టును తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రులు పక్కకు పెట్టినా వైయస్ మాత్రం పక్కకు పెట్టలేదన్నారు. ప్రాణహితకు జాతీయ హోదా కోసం ప్రయత్నించారని షర్మిల అన్నారు. తెలంగాణపై ప్రేమ లేకుండానే ఇవన్నీ వైయస్ చేశారా చెప్పాలని కెసిఆర్‌ను అడిగారు. ప్రాంతీయ విభేదాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందుతున్న పార్టీలకు బుద్ధి చెప్పి ప్రజలు జగన్‌కు మద్దతు పలికే రోజు వస్తుందన్నారు.

గాలి జనార్ధన్ రెడ్డికి ఓబుళాపురం, తనకు బయ్యారం మైన్స్ ఇచ్చారని కెసిఆర్ అంటుంటారని, అది అబద్దమని మేం నిరూపిస్తే చిన్నవాళ్లమైనా మా కాళ్లు, చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పే సంస్కారం ఉందా అని ఆమె ప్రశ్నించారు. మీకు కూడా బిడ్డలు ఉన్నారని, మీ బిడ్డలపై నిందలు వేస్తే ఊరుకుంటారా అన్నారు. కేంద్రం ఓ సంస్థకు భూములు కేటాయిస్తే తమకేం సంబంధమన్నారు. తనకు బయ్యారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

వైయస్ ఏ పని చేసినా రాష్ట్ర ప్రజల మంచి కోసమే తప్ప తన స్వార్థం కోసం చేయలేదన్నారు. తెలంగాణ కోసం బాబు హయాంలో ఖర్చు చేసింది రూ.7 వేల కోట్లని, కిరణ్ హయాంలోనూ అంతే ఖర్చు చేశారని, కానీ వైయస్ మాత్రం రూ.25వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. రెండుసార్లు కేంద్రంలో, రాష్ట్రంలో వైయస్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారని, కానీ కాంగ్రెసు మాత్రం ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.

సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్‌ను దోషిగా చూపించినా మాట్లాడని కాంగ్రెసు నేతలు ఆయనను తమ నేతగా చెప్పడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. రాజన్న రాజ్యం రామరాజ్యంలా ఉండేదన్నారు. కానీ కిరణ్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు అధికారం కోసం పిల్లనిచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కైన చంద్రబాబు ప్రజా సమస్యలపై బాధ్యతను విస్మరిస్తున్నారన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. స్వర్గీయ ఎన్టీఆర్ పథకాలకు బాబు తూట్లు పొడిచారన్నారు. హెరిటేజ్ కోసం చిత్తూరు డైరీనీ మూసివేయించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినా హామీలు బాబుకు ఆ తర్వాత గుర్తుండవన్నారు. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే బాబు రాష్ట్రానికి తన హయాంలో చేసిందేమీ లేదన్నారు. యాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు.

బాబుకు లేనిది.. వైయస్, జగన్‌కు ఉన్నది విశ్వసనీయత అన్నారు. ప్రజలు పిచ్చి వాళ్లు కాదని, కాంగ్రెసు టిడిపి నేతల మాటలు వినరన్నారు. జగన్ బయట ఉంటే కష్టమని భావించి కాంగ్రెసు టిడిపి కుమ్మక్కై ఆయనను జైలుకు పంపించాయని విమర్శించారు. దేశవిదేశాల్లో బాబుకు ఆస్తులు ఉన్నా పట్టించుకోని కాంగ్రెసు ప్రభుత్వం జగన్ పై సిబిఐ విచారణ పేరుతో కుట్ర చేస్తోందన్నారు. ఉదయించే సూర్యున్ని జగన్ని ఎవరూ ఆపలేరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+