విద్యార్థినికి లైంగిక వేధింపులు: సస్పెండైన టీచర్

పాఠశాలలో బాబు అనే ఉపాధ్యాయుడు ఆమెను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. అసభ్యకర మాటలతో, చేష్టలతో లైంగికంగా వేధిస్తుండేవాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని స్నేహితులకు చెప్పుకొని వాపోయింది. అందరూ కలిసి ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో సోమవారం ఆ విద్యార్థిని తల్లిదండ్లకు విషయాన్ని చెప్పింది.
దీంతో తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు చేరుకొని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. డిఈవో అక్కడకు చేరుకొని విచారణ జరిపారు. ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తరలించారు.












Click it and Unblock the Notifications